కాపర్ కేబుల్ వైర్ల దొంగల గ్యాంగ్ అరెస్ట్

TEJA NEWS

కాపర్ కేబుల్ వైర్ల దొంగల గ్యాంగ్ అరెస్ట్

** 7మంది నిందితుల నుంచి రూ.5.30 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం

తిరుపతి: జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఉత్తర్వుల మేరకు, చంద్రగిరి ఎస్డీపిఓ బేతపూడి ప్రసాద్ సూచనలతో పాకాల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి. చిన్న గోవిందు ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న వ్యవసాయ బోరు మోటార్ కాపర్ కేబుల్ వైర్ల దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ క్రమంలో పాకాల పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తరుణ్ తమ సిబ్బంది పిసీ -2965 మునిరాజ్, పీసీ -2940 శ్రీనాథ్, హెచ్.సీ1236 లతో కలిసి ప్రత్యేక గస్తీ నిర్వహించారు.
ఆదివారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించగా ఒక ఆటో వద్ద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను గమనించిన వారు ఆటోను అక్కడే వదిలి పారిపోవడానికి ప్రయత్నించగా వెంటాడి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న సంచులను పరిశీలించగా కాపర్ కేబుల్ వైర్లు, దొంగతనాలకు ఉపయోగించే పనిముట్లు లభించాయి. విచారణలో వారు తిరుపతి జిల్లా పరిధిలోని పలు మండలాల్లో వ్యవసాయ బోరు మోటార్లకు అమర్చిన కాపర్ కేబుల్ వైర్లను కత్తిరించి దొంగతనం చేయడం, ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దర్యాప్తులో భాగంగా మరికొంతమంది సహచరుల వివరాలు బయటపడడంతో మొత్తం 7 మంది నిందితులు ఈ కేసులో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది.

అరెస్ట్ అయిన నిందితులు…

నల్లతంబి శ్రీనివాస్ (19), రేణిగుంట, పృధ్విరాజ్ (26), తుమ్మలగుంట / కుర్రకాలువ, నాగపూర్ బలరాం (30), రామకృష్ణాపురం, రేణిగుంట మండలం, దేవరాజ్ మురుగేశ్ (33), రామకృష్ణాపురం, రేణిగుంట మండలం,

రిసీవర్లు:

గంగి శెట్టి – దామినేడు,
గడ్డం హరి – రేణిగుంట ప్రాంతం, రాజ్ దేవ్ తిరుచానూరులు ఉన్నారు.
స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు, సుమారు 2000 మీటర్ల కాపర్ కేబుల్ వైర్లు, డెల్ ల్యాప్‌టాప్, రెడీమి మొబైల్ ఫోన్, ఫాడ్జ్ ఫ్యాషన్ స్మార్ట్ వాచ్, బంగారు ఉంగరం – 2 గ్రాములు, పిల్లల చెవి మాటీలు – 1 జత (1.9 గ్రాములు) కేబుల్ కట్టర్, తాళాలు పగలగొట్టడానికి ఉపయోగించిన ఇనుప రాడ్లు, ఆటో రిక్షా ఏపీ 39 యూఎస్ 1797, టీవీ నగదు రూ.1,00,000, మొత్తం స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు విలువ సుమారు రూ.5,30,000.ఈ కేసును ఛేదించడంలో చురుకుగా పని చేసిన పాకాల సబ్-ఇన్స్పెక్టర్ తరుణ్, పోలీసు సిబ్బందిని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు అభినందించారు.

You cannot copy content of this page

Scroll to Top