ప్రజల ఆరోగ్యానికి అండ…సీఎం సహాయ నిధి : బిఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు…

TEJA NEWS

ప్రజల ఆరోగ్యానికి అండ…సీఎం సహాయ నిధి : బిఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు…

దాదాపు రూ.7,75,000/- ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు పత్రాల అందజేత…

చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా వెంటనే స్పందించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి దాదాపు రూ.7,75,000/- రూపాయలను మంజూరు చేయించగా ఈరోజు ఆయా డివిజన్లకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు CMRF సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

జగద్గిరిగుట్ట డివిజన్….
126 – జగద్గిరిగుట్ట డివిజన్ మద్దూర్ నగర్ కు చెందిన లబ్ధిదారులు బేబీ సిద్రా మహేక్ తండ్రి మహమ్మద్ షకీల్….. మంజూరు : రూ.6.00 (ఆరు లక్షలు)

సుభాష్ నగర్ డివిజన్…
130 – సుభాష్ నగర్ డివిజన్ సూరారం రాజీవ్ గృహకల్ప కు చెందిన లబ్ధిదారులు కొలు పూరి సాయి గిరిజ తండ్రి కె.రమేష్ రాజు…మంజూరు : రూ.1.00 (లక్ష రూపాయలు)

కుత్బుల్లాపూర్ డివిజన్….
131 – కుత్బుల్లాపూర్ డివిజన్ ఎన్టీఆర్ నగర్ కు చెందిన లబ్ధిదారులు బాణాల ప్రమీల భర్త ప్రమీల రాం కుమార్…. మంజూరు: రూ.75,000/- ( డెబ్భై ఐదు వేల రూపాయలు)

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జగన్, సురేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు నల్ల వేణు, ముంతాజ్అలీ, గుబ్బల లక్ష్మీనారాయణ, కిషోర్ చారి, సదానంద్ చారి, మహమ్మద్ ఆజం, మెట్ల శ్రీను, బొంబాయి శ్రీను, ఎండి. నసీరుద్దీన్, నాగరాజు, కళ్ళెం శ్రీనివాస్, విజయ్, వెంకట్ రెడ్డి, ఆంజనేయులు, రమణా రెడ్డి, వెంకటేష్, రాకేష్ జలిగం, నర్సింహా రెడ్డి, జయం చారి మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top