మంచి పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలి…
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
పెద్దపల్లి // కాల్వ శ్రీరాం పూర్: .విద్యార్థినులకు మంచి పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కాల్వ శ్రీరాంపూర్ మండలంలో కే.జి.బి.వీ ను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినులతో కలిసి భోజనం చేసారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, కేజీబీవీ లోని తరగతి గదులు, డైనింగ్ హాల్ , కిచెన్ ఏరియా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, ఇతర సౌకర్యాల గురించి ఆరా తీశారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా కేజీబీవీ పరిసరాలను క్లీన్ చేయాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థినులకు అందించే ఆహారం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ మార్గ దర్శకాల ప్రకారం అవసరమైన మేర పోషకాలు వచ్చే విధంగా చూడాలని అన్నారు.
అంతకు ముందు ఓదెల మండలం కొలనూరు గ్రామంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా అమలు చేస్తున్న పారిశుధ్య పనులు, ఫైల్ క్లీయరెన్స్ అంశాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
