మన చంద్రన్న ప్రభుత్వంలో రైతే రారాజు
విడవలూరు మండల కేంద్రంలో ధాన్య సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన
ఎమ్మల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రంలో ధాన్య సేకరణ కేంద్రం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి. ముందుగా వారికి టిడిపి విడవలూరు నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ..తాను రైతునే అయినప్పటికీ వ్యవసాయ సంబంధ బాధ్యతలన్నీ ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చూస్తారని తనకు రైతు సమస్యలపై అవగాహన కల్పించింది దివంగత మాతూరు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. గత సంవత్సరం రబి సీజన్ సందర్భంగా ధాన్య సేకరణకు సంబంధించి మాతూరు శ్రీనివాసులు రెడ్డి చూపించిన చొరవను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఈ సందర్భంగా మననం చేసుకున్నారు. ధాన్య సేకరణలో తలెత్తే గోనె సంచుల కొరత, ట్రాన్స్ పోర్ట్ తదితర సమస్యలపై జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు మరియు మిల్లర్లతో ఇప్పటికి పలు సార్లు చర్చించడం జరిగిందని రైతులకు అండగా నిలిచి సహాయ సహకారాలు అందించేందుకు అందరూ హామీఇచ్చారన్నారు.ముఖమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పాలిట పెద్దన్నలా రైతు సంక్షేమ పాలన అందిస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక అస్తిత్వం కోల్పోయిన సాగునీటి సంఘాల ఏర్పాటు, సాగునీటి కాలువల పూడికతీత లాంటి చర్యలు రైతులకు ఎంతో ఉపయోగ పడ్డాయనన్నారు.
రైతులు ధాన్య ఆరబెట్టుకునేందుకు ప్రతి మండలానికి ఒక కళ్ళం ఏర్పాటు చేస్తున్నామని కల్లాల ద్వారా తేమ శాతం లాంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనన్నారు. రైతులు ఎదుర్కుంటున్న తేమ శాతం సమస్యను కలెక్టర్ హిమాన్షు శుక్లా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు వివరించారు. ఈ నెల 13 వ తేది అన్నదాత సుఖీభవ తాలూకు ఆర్ధిక సహాయం అందనున్న నేపథ్యంలో ప్రతి రైతు సమీప రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి ఫార్మర్ ఐడి లు చెక్ చేసుకోవాలని పేర్లు లేకుంటే వెంటనే పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పట్టాదార్ పాస్ పుస్తకాలు మరియు భూసార పరీక్షా పత్రాలను ఎమ్మెల్యే రైతులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏడిఏ జి అనిత, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీహరి రెడ్డి, సీనియర్ టిడిపి నాయకులు చెముకుల శ్రీనివాసులు, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, అచ్యుత్ రెడ్డి,ఆవుల వాసు, పాశం శ్రీహరి రెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, సత్య రెడ్డితోపాటు అగ్రికల్చర్ సిబ్బంది కూటమి నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు..
