బావమరిది మరణవార్త విని బావ గుండెపోటుతో మృతి
Mar 12, 2026,
బావమరిది మరణవార్త విని బావ గుండెపోటుతో మృతి
తెలంగాణ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సింగాపురం గ్రామానికి చెందిన ముస్కె ఎల్లయ్య (50) హైదరాబాద్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన బామ్మర్ది గుంపుల మనోహర్ స్వగ్రామంలో బైక్పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతిచెందాడు. ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఎల్లయ్య గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
