ప్రజల్లో నుంచి వచ్చిన పార్టీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
వై.యస్.ఆర్ 16వఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేసిన కోవూరునాయకులు
కూటమి ప్రభుత్వంలో సంక్షేమం లేదు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోవూరు మైధిలి సెంటర్ దగ్గర ఉన్న దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైసీపీ నాయకులు అనంతరం వారు మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి ఆశయాలని కొనసాగించాలని ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి ఒక్క అడుగు ముందుకేస్తే వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు రెండు అడుగుల ముందుకేసి ప్రజలకు పరిపాలన అందించాలని ఉద్దేశంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది ఆయన పార్టీని స్థాపించిన తర్వాత అనేక కష్టాలు పడడం జరిగింది ఆ కష్టాల్లోనే అధికమించి 2019లో విజయ డంక మోగిచ్చి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది.
ఈ కోటను ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంటే ఒక్క పెన్షన్ గాని, రేషన్ కార్డు గాని, ఒక ఇల్లు పట్టా గాని, ఇచ్చినట్టే లేదు. ప్రజల కోసం వైయస్ ఆర్ పార్టీ ఎప్పుడు అండదండగా ఉంటుందని మన పార్టీ పోరాటంలో వచ్చిన పార్టీ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉండే పార్టీ మనదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి,కోవూరు మండల అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి, జడ్పిటిసి కవరగిరి శ్రీలత, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, గంగవరం యెడెం సర్పంచ్ లక్ష్మి కుమారి,హరిప్రసాద్ రెడ్డి, గాజుల మల్లికార్జునరావు, వైసీపీ నాయకులు తురక భాస్కర్, గున్నం జనార్ధన్, తోడేటి మహేష్, కవరగిరి ప్రసాద్,సరాబు వెంకట సుధీర్ కుమార్, జ్యోతి, ప్రమీలమ్మ, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
