జనసేనాని స్పూర్తితో కొరికాన ఫౌండేషన్ ఆపన్నహస్తం..
పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి, అకాల మరణం చెందిన జనసైనికుల కుటుంబాలను కొరికాన ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ తన వంతు సహాయంగా తన సొంత నిధుల నుండి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు..
ఎచ్చెర్ల ఎమ్మెల్సీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు చేతుల మీదుగా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది..
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 మంది బాధిత కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 15 లక్షల ఆర్థికసహాయం అందజేశారు..
అకాల మరణం చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను గుర్తించి, పార్టీ ఆవిర్భావం రోజున వారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయడం కొరికాన రవికుమార్ సేవా దృక్పథానికి నిదర్శనమని నాగబాబు అన్నారు..
కష్టాల్లో ఉన్న వారికి తోడుగా నిలవడమే జనసేనాని నేర్పిన సంస్కారం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ సేవా కార్యక్రమం చేయడం ఎంతో తృప్తినిచ్చిందని రవికుమార్ తెలిపారు.
