జనసేన ఆవిర్భావ దినోత్సవం ప్రధాత మండలనేని చరణ్ తేజ శుభాకాంక్షలు
చిలకలూరిపేట: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేటలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో భాగంగా ప్రముఖ ప్రదాత, జనసేన నాయకులు మండలనేని చరణ్ తేజ పార్టీ శ్రేణులకు మరియు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశయ బలం, అంకితభావమే పునాదిగా పుట్టిన జనసేన పార్టీ నేడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిందని కొనియాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేనాని కొణిదల పవన్ కళ్యాణ్ , కూటమి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చూపిన మార్గంలో నడుస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని చరణ్ తేజ పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ నాయకుడికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
