తిరుపతిలో ఐన్ స్టీన్ జయంతి

TEJA NEWS

తిరుపతిలో ఐన్ స్టీన్ జయంతి

తిరుపతి: ఐన్ స్టీన్ జయంతి సందర్భంగా జనవిజ్ఞాన వేదిక తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి రఫీ , కిరణ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అధిపతి జయరాం రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి రఫీ మాట్లాడుతూ భౌతిక శాస్త్రంలోని పెను మార్పుకు సిద్ధమైన విప్లవాత్మకమైన రిలేటివిటీ లాంటి సిద్ధాంతాలు ప్రతిపాదించడం అద్భుతమైన విషయమని , జాత్యాంహంకారాన్ని నిరసించారు” అన్నారు. అదేవిధంగా ఉపాధ్యక్షుడు ఓ.వెంకటరమణ మాట్లాడుతూ “మానవతావాది విశ్వమానవ విజ్ఞాన శిఖరం, విశ్వశాంతి కాముకుడు ఆధునిక భౌతికశాస్త్రం లో కీలకమైన పత్రాలు 1 థియరీ ఆఫ్ రిలేటివిటీ రెండు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ , ఈఎం సి స్క్వేర్, క్వాంటం థియరీ ఆఫ్ రేడియేషన్ సమర్పించడంతో పాటు అణుబాంబు ప్రయోగాలను, యద్దాలను తీవ్రంగా ఖండించారు. శాంతిని, సమతను కాంక్షించారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ ఆక్రమణ చేస్తున్న నేపథ్యంలో ఐన్ స్టీన్ శాంతి వచనాలను ఆలకించా లని” తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం అధ్యక్షులు నడ్డి నారాయణ, ముని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top