చిమనగుంటపల్లిలో జ్యోతిరావు పూలే – సావిత్రిబాయి ల విగ్రహాలకు భూమి పూజ:

TEJA NEWS

చిమనగుంటపల్లిలో జ్యోతిరావు పూలే – సావిత్రిబాయి ల విగ్రహాలకు భూమి పూజ:

వనపర్తి

సామాజిక విప్లవానికి మార్గదర్శకులు మహాత్మ జ్యోతిరావు పూలే మరియు మహిళా విద్యా ప్రేరకురాలు సావిత్రిబాయి పూలే విగ్రహాల నిర్మాణానికి చిన్న గుంటపల్లి గ్రామంలో అంబేద్కర్ నవచైతన్య సొసైటీ, స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ల సంయుక్తంగా మంగళవారంభూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ నగర్ సొసైటీ అధ్యక్షులు పానుగంటి భాస్కర్ * *అంబేద్కర్ నవ చైతన్య సొసైటీవైస్ ప్రెసిడెంట్ గొర్ల చంద్రకాంత్ జనరల్ సెక్రెటరీ G కృష్ణ ట్రెజరర్ G పుల్లయ సలహా దారులు K బాలయ్య వార్డు మెంబర్ అశోక్
అదేవిధంగా స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షులు వాకిటి మహేష్ గౌరవాధ్యక్షులు వాకిటి నిలేందర్, భగవంతు యాదవ్, వాకిటి సుదర్శన్, ప్రధాన కార్యదర్శి చెంచేటి మహేష్, మనగల రాజశేఖర్
కోశాధికారులు వాకిటి నరేష్, మా దగ్గర చంద్రశేఖర్.


ఉపాధ్యక్షులు మేడముని కుమార్, పల్లె ముని మల్లేష్లు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, “సమాజంలో అణగారిన వర్గాలకు విద్యా హక్కులు, సమానత్వం, గౌరవం తీసుకువచ్చిన పూలే దంపతుల ఆశయాలు నేటికీ అత్యంత ప్రాసంగికం. వారి స్ఫూర్తితోనే సమాన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని , పూలే దంపతుల ఆలోచనలను గ్రామ స్థాయిలో బలంగా తీసుకెళ్లడం తమ బాధ్యత అని, ఈ విగ్రహాలు కేవలం శిల్పాలు కాకుండా సామాజిక చైతన్యానికి చిహ్నాలుగా నిలవనున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, తదితరులు యువత, మహిళలు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సహకరిస్తే పూలే దంపతుల ఆశయాలను అమలు చేయడంలో ఎలాంటి రాజీ లేకుండా ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు.

You cannot copy content of this page

Scroll to Top