కూటమి ప్రభుత్వం రాగానే రూ.3వేలు పింఛన్ పెంచాం.. ఇప్పుడు ఉచిత ప్రయాణం

TEJA NEWS

కూటమి ప్రభుత్వం రాగానే రూ.3వేలు పింఛన్ పెంచాం.. ఇప్పుడు ఉచిత ప్రయాణం

దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇది

దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత

ధర్మవరంలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన సునీత

బస్సుల్లో దివ్యాంగులకు సహకరించాలన్న ఎమ్మెల్యే సునీత

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 3వేల రూపాయలు పింఛన్ పెంచిందని.. ఇప్పుడు అదే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోందని.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరిగిన దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ధర్మవరం ఆర్టీసీ డిపో ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, ఆర్టీసీ అధికారులు, దివ్యాంగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జెండా ఊపి దివ్యాంగులు ప్రయాణించే బస్సును ఎమ్మెల్యే సునీత ప్రారభించారు. అనంతరం వారితో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. జీరో ఫేర్ టికెట్ ను వారికి అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులు ఎందులోనూ తక్కువ కాదు.. వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. వారికి ప్రభుత్వ సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు. దివ్యాంగులను మొదటి నుంచి ప్రోత్సహిస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమేనన్నారు. కూటమి ప్రభుత్వం రాక ముందు అందరికీ ఇస్తున్నట్టుగానే దివ్యాంగులకు కూడా 3వేల రూపాయలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవారన్నారు. కానీ ప్రభుత్వం రాగానే దివ్యాంగుల స్థితిగతుల్లో మార్పు తేవాలని.. వారికి ఆర్థిక చేయూతనందిచాలని.. పింఛన్ ను 6వేలు చేశారన్నారు.

గతంలో 50శాతం మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో రాయితీ ఉండేదన్నారు. ఇప్పుడు దివ్యాంగులకు పూర్తిగా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించారన్నారు. 100శాతం వికలత్వం ఉన్న వారికి సహాయంగా వచ్చే వారికి కూడా టికెట్ లో 50శాతం రాయితీ ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 11లక్షల మందికి దీని ద్వారా లబ్ధి చేకూరుతోందన్నారు. దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు కూడా అందిస్తున్నామని చెప్పారు. అవసరమైన వారు దరఖాస్తు చేసుకుంటే ప్రధాన్యత వారిగా దీనిని అందిస్తారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు సీట్లు ఇచ్చి తోటి ప్రయాణీకులు కూడా సహకరించాలని ఎమ్మెల్యే సునీత విజ్ఞప్తి చేశారు….

You cannot copy content of this page

Scroll to Top