
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ 2వ వార్డ్ మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్ ఇటీవల ప్రగతి నగర్‌లో జరిగిన ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాద సమయంలో వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఆ ఘటనలో పాల్గొంటూ ఆయనకు కాలు ఫ్రాక్చర్ అయింది.
ఈ నేపథ్యంలో, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి దివాకర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు