కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడం గొప్పతనం.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
దుండిగల్ మండలం దుండిగల్ గ్రామస్తులు సుమారు 20 మంది భారత కమ్యూనిస్టు పార్టీలో నేడు దుండిగల్ లోని సిపిఐ పార్టీ స్థలం వద్ద సిపిఐ పార్టీలో చేరడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ పాల్గొని వారికి సభ్యత్వం ఇచ్చి స్వాగతం పలకడం
జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల్గా గత పది సంవత్సరాలనుండి కార్మికులు సంఘం లో ఉండీ కార్మికుల సమస్యల కోసం సిపిఐ కృషి చెయ్యడం వల్ల,వారికోసం నిత్యం నిస్వార్ధంగా నిజాయితీగా పనిచెయ్యడం వల్ల నేడు వారందరు సిపిఐ లో చేరడం ప్రజలు సిపిఐ వైపు చూస్తున్నారు అనేదానికి నిదర్శనమని అన్నారు. సిపిఐ పార్టీలో చేరడం వల్ల ఎలాంటి డబ్బులు రావని,సంపాదన ఉండదని కానీ ప్రజల కోసం పనిచెయ్యడం ద్వారా సమాజంలో మంచి మనిషిగా గుర్తింపు పొందుతారని అన్నారు.

డబ్బులు మద్యం భోజనాలు లాంటి ప్రలోబాలకు సిపిఐ గురి చెయ్యదని తెలిసినప్పటికి పార్టీలో చేరడం గొప్ప విషయమని కావున సిపిఐ కార్యకర్తలుగా నిజాయితీ గా ఉంటుంది ప్రజా సమస్యల కోసం పనిచెయ్యాలని కోరారు.రానున్న రోజుల్లో మరింత విస్తృత పర్చడానికి కృషిచేయ్యాలని కోరారు.
ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్ రావ్,శ్రీనివాస్ లు కూడా అతిథులుగా పాల్గొని చేరినవారికి సభ్యత్వ కార్డులు ఇచ్చి వారికీ స్వాగతం పల్కడం జరిగింది.
సిపిఐ దుండిగల్ నాయకులు స్వామీ,మల్లేష్,వెంకటేష్,యాదగిరి,అన్సారీ,రాజు,చిత్తరీ,నర్సింహా,శంకర్,ఆంజనేయులు,పోచయ్య,సత్యనారాయణ,దుర్గాప్రసాద్,మహేష్,శ్రీనివాస్ లు పాల్గొన్నారు.