
కరెంటు నిరంతరం పోకుండా చర్యలు చేపట్టాలని జీడిమెట్ల ఎలక్ట్రికల్ డిఈ శ్రీనివాసులు నీ కోరిన సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ s r నాయక్ నగర్ మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకట శేషాచారి
కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా లో ఎలక్ట్రికల్ DE కార్యాలయం లో శ్రీనివాస్లు కి ఎస్సార్ నగర్ లో నిరంతరం కరెంట్ సరఫరా పోతున్న సందర్భంగా వారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అసెంబ్లీ బిఆర్ఎస్ పార్టీ విప్ కెపి వివేకానంద కి తెలియజేయగా mla de తో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని అదేచించారు. నిన్న గాలివానకు కూడా కరెంటు పోయి ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియని పరిస్థితిలో ఉంది కావున సిబ్బందిని అప్రమత్తం చేయాలని రాబోయేది ఎండాకాలం కాబట్టి ముందస్తు చర్యలు చేపట్టాలని మెయింటినెన్స్ కొరవబడిన సందర్భంలో పూర్తి మెయింటినెన్స్ చేయాలని (ఎస్సార్ నాయక్ నగర్ అపురూప కాలనీ జనప్రియ అపార్ట్మెంట్స్ మోడీ అపార్ట్మెంట్స్) డి ఈ ని s r నాయక్ నగర్ మాజీ ప్రెసిడెంట్ ఆలూరి వెంకట శేషాచారి ,సీనియర్ brs నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ శ్రీనివాస్ కి ఫిర్యాదు చేశారు. De స్పందిస్తూ వెంటనే వారి సిబ్బందితో మాట్లాడి కంప్లైంట్ రాకుండా చూసుకోవాలని వెంటనే మెయింటెనెన్స్ చేపట్టాలని త్వరలో డిఈ గారు కూడా విజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జి. సింహాచలం, కిషోర్ కృష్ణ , సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.