హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ…..

TEJA NEWS

హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ…..

పెద్దపల్లి//రామగుండం: ఉగాది పండగ పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో.. ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం రామగుండం అంబేద్కర్ చౌక్, రామగుండం రైల్వే స్టేషన్ వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం కార్పొరేటర్స్ ఇసంపల్లి అంజుల్, దారంగుల కుమార్, నిమ్మ రాజుల రవి, సిరి శెట్టి సతీష్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బుష్పాక సంతోష్ మహారాజ్, హాజరయ్యారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బుష్పాక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ ఉగాది పండుగను హిందువులు విశేషంగా జరుపుకుంటారు. ఉగాది పచ్చడిలో షడ్రుచులు జీవితంలోని హెచ్చుతగ్గులను సూచిస్తాయి, ఉగాది పండుగ ఎంతో ప్రత్యేకమైనది. పంచాంగం ప్రకారం ఇది చైత్రమాసం మొదటి రోజు జరుపుతారు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హిందువులంతా ఈ పండుగను విశేషంగా జరుపుకుంటాం ఉగాది పండుగ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి.

ఉగాది పండుగ రోజున షడ్రుచులతో తయారుచేసిన పచ్చడిని తినడం ఆనవాయితీగా వస్తుంది. తీపి, పులుపు, కారం, వగరు, ఉప్పు, చేదు కలిసిన షడ్రుచుల సమ్మేళనం సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను సమానంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి అందజేస్తుంది.

ఈ పచ్చడి తయారీలో వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి ప్రతీక అని శాస్త్రం చెబుతుందని, ఉగాది పచ్చడలో వినియోగించే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు ఈ ఆరు షడ్రుచులు జీవితంలో హెచ్చుతగ్గులను సూచిస్తాయి. ఉగాది పచ్చడలో కచ్చితంగా చేదు కోసం వేప పువ్వును వాడుతారు.

ఇది జీవితంలో ఎదురయ్యే బాధలు, కష్టాలకు గుర్తు. మనిషి జీవితంలో కష్టాలు అత్యంత సహజం.తీపి లాంటి సంతోషకరమైన సందర్భంతోపాటు చేదు లాంటి బాధలు ఉంటాయని దీని అర్థం, పచ్చడిలో తీపి కోసం బెల్లాన్ని వినియోగిస్తారు.

ఇది నోటికి తీపిని అందించడమే కాదు జీవితంలో ఎదురయ్యే తీపి గురించి కూడా చెబుతుందని. కారం. పచ్చడిలో కారాన్ని కూడా వేస్తారు. జీవితంలో మనం కోపగించుకోవడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో సమయమనం కోల్పోకూడదని దీని అర్థం పులుపు, పచ్చడిలో పులుపు కోసం చింతపండును వేస్తారు. ఈ పులుపు రుచి కాసేపటి తర్వాత విసుగును కలిగిస్తుంది, జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు విసుగు చెందుతుంటారు. అలాంటప్పుడు ఓర్పుతో భరిస్తూ ముందుకు సాగలని జీవితంలోని కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతూ, ఉత్సాహంగా ముందుకు సాగిపోవాలనే అంతరార్థం ఉప్పులో ఉంటుంది.

వగరు: వగరు కోసం పచ్చడిలో మామిడి ముక్కలను వేస్తారు. జీవితంలో చాలా సార్లు సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏలాంటి కఠిన సవాలనైనా ఎదిరించి గెలుపు బాటలో సాగిపోవాలని ఇది సూచిస్తుంది. ఈ షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని స్వీకరించడం ద్వారా శరీరం దేహశుద్ధి అవుతుంది, శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో హిందు వాహిని నాయకులు మహాత్మా ఆనంద్, బుషిపాక సదానందం, బంధారపు భూపతి గౌడ్, పూర్ణ చారి, రామ్, లక్ష్మణ్, అడ్వకేట్ సతీష్ రెడ్డి, బోయబోతు కుమార్ , బుషిపాక ప్రేమ్ కుమార్, మద్ది అన్వేష్, సాయి, , భూషిపక అభిలాష్, ఆరుముల్ల శ్యామ్, చింటూ, బుషిపాక శ్రీకాంత్, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top