నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి..

TEJA NEWS

నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలి…

-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….


పెద్దపల్లి// రామగిరి: మంథని,నిర్ణీత గడువులోగా చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగిరి మండలం , మంథని పట్టణ పరిధిలో విస్తృతంగా పర్యటించారు.

రామగిరి మండలంలోని కేజీబీవీ విద్యాలయం, నూతనంగా నిర్మించడానికి సిద్ధంగా ఉన్న తహసిల్దార్ భవన స్థలం కలెక్టర్ పరిశీలించారు. మంథని పట్టణంలోని సంగీత పాఠశాల, మున్సిపల్ కార్యాలయ, జూనియర్ బాయ్స్ స్కూల్, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. మంథని పట్టణం లోని షెడ్యూలు కులాల బాలికల వసతి గృహం, ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగిరి కేజీబీవీ లో నూతనంగా ఏర్పాటు చేసిన మాడ్యులర్ కిచెన్ ను ప్రారంభించారు. స్టీమ్ రైస్ బాయిలర్, ఆటోమేటిక్ రోటి మేకర్, ఇడ్లీ బాయిలర్, ఎల్.పీ.జి గ్యాస్ లైన్, 18 డైనింగ్ టేబుల్స్ లను సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. రామగిరి తహసిల్దార్ కార్యాలయం నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు.

మంథని సంగీత స్కూల్ ప్రిన్సిపాల్ సూచనల మేరకు అభివృద్ధి పనులను 15 రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. పట్టణంలో నూతనంగా చేపడుతున్న పురపాలక కార్యాలయ నిర్మాణ పనులు నిర్దిష్ట గడువు లోగా పూర్తయ్యే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.

మంథని లోని జూనియర్ బాయ్స్ స్కూల్ లో పెండింగ్ ఉన్న చిన్న చిన్న నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి, మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గురుకుల పాఠశాలలో స్టేజి, డార్మటరీ, డైనింగ్ హాల్ వంటి అభివృద్ధి పనులు పూర్తి చేసామని, పాత స్కూలు భవనం, హస్టల్ కు అవసరమైన మరమ్మతులు చేయించి పెయింటింగ్ వేయాలని కలెక్టర్ సూచించారు.

కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రిన్నోవేషన్ భాగంగా పెయింటింగ్, అంతర్గత సిసి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల ఆసుపత్రి పనులు స్లాబ్ దశలో ఉన్నాయని వీటిని గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంటరామగిరి తహసిల్దార్ సుమన్, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్,టిజిఎంఎస్ఐడిసి ఈఈ విక్రమ్, ఈఈ పంచాయతీ రాజ్ శంకరయ్య, ఏఈ లు అనుదీప్,వరలక్ష్మి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top