రంజాన్ ప్రార్థనలకు పటిష్ట బందోబస్తు

TEJA NEWS

రంజాన్ ప్రార్థనలకు పటిష్ట బందోబస్తు

తిరుపతి: పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిరాలు, మసీదుల వద్ద విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలు ప్రశాంతంగా, నిరభ్యంతరంగా ప్రార్థనలు నిర్వహించుకునేలా జిల్లా పోలీసులు సమగ్ర చర్యలు చేపట్టారు. ఎక్కడా ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేస్తూ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు చేశారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం భక్తులు సజావుగా తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా తగిన భద్రతా మరియు ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ,ప్రతిఒక్కరు సౌహార్దం, శాంతి, సామరస్య భావాలను కాపాడాలని పిలుపునిచ్చారు.

You cannot copy content of this page

Scroll to Top