నగరాన్ని సకల వసతులతో కూడిన సుందర నగరంగా అభివృద్ది చేయడానికి సహకరించాలి….

TEJA NEWS

నగరాన్ని సకల వసతులతో కూడిన సుందర నగరంగా అభివృద్ది చేయడానికి సహకరించాలి….

పెద్దపల్లి :: రామగుండం నగరాన్ని సకల వసతులతో కూడిన సుందర నగరంగా అభివృద్ది చేయడానికి సహకరించాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు.

రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో బుధవారం బడ్జెట్ ప్రత్యేక సమావేశంతో పాటు మొదటి సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశాలకు అధ్యక్షత వహించిన మేయర్ మాట్లాడుతూ… 99 రోజుల కార్యాచరణ లో భాగంగా, ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక తో పాటు పలు సందర్భాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి సానిటేషన్ లోపాలను గుర్తించడం జరిగిందని అన్నారు.

వాటిని సవరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని వివరించారు.ఎమ్మెల్యే సూచనల మేరకు ఆర్ ఎఫ్ సి ఎల్ సి వారు సి ఎస్ ఆర్ ద్వారా 550 స్ట్రీట్ లైట్స్ ఇచ్చి మరో వెయ్యి లైట్లు ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. సానిటేషన్ కు సంబందించి ట్రాక్టర్లు ,స్వచ్చ ఆటో లు కూడా సి ఎస్ ఆర్ లో కింద ఇవ్వాలని కోరడం జరిగిందని అన్నారు. ఇంటి నుండి చెత్త బయటకు రాకుండా మునిసిపల్ వాహనం ద్వారా తీసుకువెళ్ళాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు .

వంద శాతం పన్నులు వసూలు చేసినా జీతాలకు , కరెంట్ బిల్లులకు సరిపడా ఆదాయం రావడం లేదని, ప్రతి ఇంటి కొలతలు తాజాగా తీసుకోవడంతో పాటు ప్రతి నిర్మాణానికి పన్ను విధించి ఆదాయం పెంపొందించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఎమ్మెల్యే చొరవతో అభివృద్ది పనులకు నిధుల కొరత లేదని అన్నారు. ఇతర విభాగాలు కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ , పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా 567 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులు జరుగుతున్నాయని అన్నారు.

గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం పరిపాలించిన పదేండ్ల కాలంలో అభివృద్ది , సంక్షేమం కొరకు రూ 260 కోట్లు వెచ్చిస్తే రాజ్ ఠాకూర్ ఎం ఎల్ ఎ అయిన తరువాత కేవలం రెండేండ్ల కాలంలోనే 560 కోట్ల విలువైన అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. మరో 336 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ది పనుల నిమిత్తం విడుదల చేయాలని ఎమ్మెల్యే ఆద్వర్యంలో జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని అన్నారు.

ఎమ్మెల్యే , మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి , మున్సిపల్ శాఖా మంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుండి మరిన్ని నిధులు రానున్నాయని అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ 2026-27 ఆర్థిక సoవత్సరపు బడ్జెట్ వాస్తవాలకు దగ్గర ఉండే అంచనాలతో తయారు చేయడం జరిగిందని, కాగా ప్రతపాదించిన బడ్జెట్ లో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ 248 కోట్ల 66 లక్షల 51 వేలు కాగా వ్యయం 220 కోట్ల 57లక్షల 76 వేలు , మిగులు రూ 28 కోట్ల 8 లక్షల 75 వేలుగా అంచనా వేయడం జరిగిందని అన్నారు.

బడ్జెట్ ప్రతిపాదనలకు సభ్యులు బల్లలు చరించి ఆమోదం తెలిపారు.
అనoతరం మొదటి సాధారణ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎనిమిది అంశాలు ప్రవేశ పెట్టగా అన్నీ ఆమోదించారు. నగర పాలక సంస్థలో ఔట్ సోర్స్ , కాంటాక్ట్ విధానంలో ఆయా విభాగాలలో పని చేస్తున్న సిబ్బందికాల పరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ తీర్మానం చేశారు.

ఆ తరువాత పలువురు కార్పొరేటర్లు తమ డివిజన్ సమస్యలను దృష్టికి తీసుకువచ్చారు. ఈ సంధర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్పొరేటర్లు దృష్టి కి తెచ్చిన సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పరిష్కరించాలని అన్నారు. ప్రతి డివిజన్ లో వీధి దీపాలు ఏర్పాటు చేయించడానికి చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు. త్వరలో 1.25 కోట్ల విలువైన టెండర్లు తెరిచి అభివృద్ది పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

కాగా అభివృద్ది చెందిన నగరాలలో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయడానికి స్టడీ టూర్ ఏర్పాటు చేయాలని పలువురు కార్పొరేటర్లు కోరారు.

ఈ సమావేశాల్లో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె.అరుణ శ్రీ , కార్పొరేటర్లు ,నగర పాలక సంస్థ , సింగరేణి , ఎన్ టి పీ సి , ఎన్ పి డి సి ఎల్ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top