
స్విమ్స్ “ప్రాణదాణం”కు 226 మంది ఎంపిక
తిరుపతి: టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్)లో మధ్యాహ్నం డైరెక్టర్ కార్యాలయం కమిటి హాల్ లో స్విమ్స్ సంచాలకులు డాక్టర్ ఆర్.వి.కుమార్ అధ్యక్షతన “ప్రాణదానం” కమిటీ మీట్ జరిగింది. ఇందులో శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాల డా.శ్రీనాధ్ రెడ్డి, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా. రామ్, ఆర్.ఎం.ఓ. డాక్టర్ వెంకట కోటిరెడ్డి, బర్డ్ హాస్పిటల్ ఆర్ఎంఆర్ డా. రామ్మూర్తి, టిటిడి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కుసుమకుమారి, రుయా హాస్పిటల్ డా. సుబ్బలక్ష్మి, మెటర్నటీ హాస్పిటల్ డా. శ్రీనివాసులు, స్విమ్స్ ఛీఫ్ అకౌంట్ ఆఫీసర్ డి.గోపితో పాటు స్విమ్స్ కు చెందిన సంబంధిత విభాగాధిపతులు, డాక్లర్లు, సిబ్బంది పాల్గొని 226 మంది పేద రోగులను ఉచిత శస్త్ర చికిత్సలకు ఎంపిక చేశారు. పేషంట్ల ఆరోగ్య స్థితిగతులను, బియ్యం కార్డు కలిగి దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న నిరుపేదలను వారి అర్హతలను బట్టి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడానికి వివిధ విభాగాల క్రింద ఎంపిక చేయడం జరిగింది.
విభాగాల వారీగా….
కార్డియాలజి -04, కార్డియో థొరాసిక్ – 19, ఇ.ఎన్.టి.-01, జనరల్ సర్జరి -09, మెడిసిన్-20, మెడికల్ ఆంకాలజీ- 03, నెప్రాలజి-72, న్యూరాలజి -15, న్యూరో సర్జరీ-48, గైనకాలజి-02, రేడియేషన్ ఆంకాలజీ -02, రేడియాలజీ- 02, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రీలజీ-24, సర్జికల్ ఆంకాలజీ – 04, యూరాలజీ -01 మొత్తం 226 మంది పేషెంట్లను ఎంపిక చేయడం జరిగింది.
పేద రోగులకు ప్రాణదానం క్రింద ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడానికి ఆర్థిక సహాయం చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి ఈ సందర్భంగా పేషంట్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి చేయూతనిచ్చే టి.టి.డి. ప్రాణదాన పథకానికి దాతలు, సంస్థలు సహృదయంతో ముందుకు వచ్చి విరివిగా విరాళాలు అందించాలన్నారు.