శంకర్‌పల్లి సాయిబాబా ఆలయం ఆధ్వర్యంలో సాన్స్ స్కిన్ హాస్పిటల్ వారి ఉచిత పరీక్షల హెల్త్ క్యాంపు సక్సెస్

TEJA NEWS

శంకర్‌పల్లి సాయిబాబా ఆలయం ఆధ్వర్యంలో సాన్స్ స్కిన్ హాస్పిటల్ వారి ఉచిత పరీక్షల హెల్త్ క్యాంపు సక్సెస్

చర్మ, జుట్టు వ్యాధులపై అవగాహన కల్పన

50 మంది ప్రజలకు ఉచిత సేవలు, మందుల పంపిణీ

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని సాయికాలనీలో గల సాయిబాబా ఆలయం ఆధ్వర్యంలో సాన్స్ స్కిన్ హాస్పిటల్ వారి ఉచిత పరీక్షల హెల్త్ క్యాంపు సక్సెస్ అయిందని డా. సాయిసింధు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ అడ్వాన్స్డ్ స్కిన్ కాస్మోటిక్ వైద్య సేవలు పట్టణ మండల ప్రజలకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి వెళ్లే అవసరం లేకుండా ప్రజలకు చేరువలోనే సాంగ్స్ స్కిన్ హాస్పిటల్ ఉందని డాక్టర్ చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి ప్రజలు హాజరై సేవలను వినియోగించుకున్నారు. మొత్తం 50 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. అనంతరం డా. సాయిసింధు మాట్లాడుతూ చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు వైద్య సేవలు చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. శిబిరం అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి వారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

You cannot copy content of this page

Scroll to Top