వడ్డెరపాలెంలో ఘనంగా గృహప్రవేశ వేడుక

TEJA NEWS

వడ్డెరపాలెంలో ఘనంగా గృహప్రవేశ వేడుక

హాజరైన జనసేన నాయకులు

చిలకలూరిపేట:పట్టణంలోని 26వ వార్డు పరిధిలో ఉన్న వడ్డెరపాలెంలో బొంతు తవిటి నాయుడు నూతన గృహప్రవేశ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నియోజకవర్గ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ విచ్చేసి, నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజా సేవలో ముందుంటాం: మండలనేని చరణ్ తేజ

ఈ సందర్భంగా చరణ్ తేజ మాట్లాడుతూ, సామాన్య ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం తమ బాధ్యతని పేర్కొన్నారు. నూతన గృహం ఆ కుటుంబానికి సుఖసంతోషాలను చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు.

హాజరైన ప్రముఖులు

ఈ గృహప్రవేశ కార్యక్రమానికి జనసేన నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజా రమేష్, ప్రముఖ న్యాయవాది బైరా కృష్ణ ప్రత్యేకంగా హాజరయ్యారు. వారితో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు సంఖ్యలో పాల్గొని తవిటి నాయుడు కుటుంబ సభ్యులను అభినందించారు.

You cannot copy content of this page

Scroll to Top