తెలంగాణకు మళ్లీ సీఎం కేసీఆర్ రావాలి….

TEJA NEWS

తెలంగాణకు మళ్లీ సీఎం కేసీఆర్ రావాలి….

శ్రీ వెంకటేశ్వర స్వామివారినీ వేడుకున్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి.చందర్..

పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన నుండి ప్రజలను విముక్తి చేసి, మళ్లీ తెలంగాణ సీఎంగా కేసీఆర్ రావాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి.చందర్ ఏడు శనివారాల దర్శనం మొక్కులో భాగంగా, నాలుగవ శనివారం కాలినడకన తిరుమల కొండ కు నాలుగవ సారి అలిపిరి నుండి నాలుగు గంటల పాటు నడిచి మెట్లు ఎక్కి తలనీలాలు సమర్పించి, ఉదయం దర్శనం చేసుకుని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నానని తెలిపారు.

“ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని, మళ్లీ రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించాలని, నన్ను నమ్ముకున్నా వారి బాధలు తీర్చే బలం ఇవ్వాలని, రామగుండం నియోజకవర్గం లోని సకల జనుల ప్రజల బాధలు సమస్యలు పరిష్కారం కావాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండే విధంగా ఆశీర్వదించుమని దేవున్ని వేడుకున్నానని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top