ధర్మారం మండలంలో విస్తృత పర్యటన..

TEJA NEWS

ధర్మారం మండలంలో విస్తృత పర్యటన..

-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష….

పెద్దపల్లి// ధర్మారం,
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ధర్మారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ధర్మారం మండల తహసిల్దార్ కార్యాలయం, కేజిబీవీ ను కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ సకాలంలో జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. భూ భారతి ఆన్ లైన్ దరఖాస్తులు పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

కేజీబీవీ లో బాలికలకు నాణ్యమైన ఆహారం అందించాలని అన్నారు. ప్రతి ఒక్కరికి మంచి విద్యా ప్రమాణాలు అందే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ తెలిపారు. కేజిబీవీ రినోవేషన్ పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసిల్దార్ శ్రీనివాస్,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top