గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం..

TEJA NEWS

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం..

ఈతకోటలో రూ.1.62కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు..

స్వచ్ఛరథాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

కూటమి పాలనలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతంగా జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. సోమవారం ఈతకోటలో రూ.1.62కోట్లతో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈతకోట పంచాయతీ ఏరియాలో మాట్ల సత్యనారాయణ ఇంటి నుంచి ఎన్ హెచ్16 వరకూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం నిధులు రూ.50లక్షలతో నిర్మించిన సిసీ రోడ్లు, జనిపిరెడ్డి గంగారావు ఇంటి నుంచి ఆర్అండ్ బి రోడ్డు వరకూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం నిధులు రూ.30లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. ఈతకోట నుంచి ముమ్మిడివరప్పాడు వరకూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిధులు రూ.82 లక్షలతో చేపట్టిన బి.టి.రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛఆంధ్ర, స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్చరథాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణలో తడిచెత్త, పొడిచెత్త సేకరణ కీలకమన్నారు. “చెత్త ఇవ్వండి… సరుకులు తీసుకోండి” అనే నినాదంతో స్వచ్ఛరథం ముందుకు వస్తుందన్నారు. సేకరించిన చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా తమ ఇంటి ముందుకు వచ్చిన స్వచ్ఛరధానికి ఇచ్చి అందుకు తగినట్టుగా నిత్యావసరాలు పొందవచ్చన్నారు. స్వచ్ఛరదం వద్ద ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను అందించిన వారికి ఎమ్మెల్యే స్వయంగా అందుకు తగిన నిత్యావసర వస్తువులను అందజేశారు. వ్యర్థాల నిర్వహణలో ప్రతీ పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొంటారు.

You cannot copy content of this page

Scroll to Top