పిల్లల భద్రత సమాజం మొత్తం బాధ్యత…

TEJA NEWS

పిల్లల భద్రత సమాజం మొత్తం బాధ్యత…

-పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి….

పెద్దపల్లి//రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో,8 ఇంక్లైన్ కాలనీ వి.టి.సి. కేంద్రంలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”, “అరైవ్ అలైవ్” ఫేజ్-03” కార్యక్రమాల భాగంగా గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ పర్యవేక్షణలో గోదావరిఖని 2 టౌన్ సీఐ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో వి.టి.సి. 8 ఇంక్లైన్‌లో పిల్లల భద్రత,డ్రగ్స్ నియంత్రణ,సైబర్ నేరాలు, “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి , ఎస్.పి. నాయక్ మహారాజ్ బంజారా (ప్రవచనకర్త) హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీసీపీ బి.రామ్ రెడ్డి మాట్లాడుతూ,డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నదని తెలిపారు.“పిల్లల భద్రత సమాజం మొత్తం బాధ్యత. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.చిన్న వయసులోనే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా బాధ్యతాయుతంగా వ్యవహరించడం అత్యంత అవసరం. యువత చెడు స్నేహాలు మరియు ప్రలోభాలకు లోనుకాకుండా తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి” అని సూచించారు.

ఒక్కసారి డ్రగ్స్‌కు బానిస అయితే ఆరోగ్యం, చదువు,కుటుంబ జీవితం తీవ్రంగా దెబ్బతింటాయని తెలిపారు.డ్రగ్స్ సమస్య కేవలం వ్యక్తిగత సమస్య మాత్రమే కాకుండా సమాజానికి కూడా ప్రమాదకరమని పేర్కొన్నారు.ఎవరైనా డ్రగ్స్ విక్రయం లేదా వినియోగం చేస్తున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని డీసీపీ తెలిపారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి మంచి మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అనుమానాస్పద ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు,ఓటీపీలు ఎవరితోనూ పంచుకోకూడదని హెచ్చరించారు.

“అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని డీసీపీ తెలిపారు.వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, మితిమీరిన వేగంతో వాహనం నడపకపోవడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకపోవడం వంటి నియమాలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు,ఆర్‌జీ-2 సెక్యూరిటీ ఆఫీసర్ షరీఫ్, వి.టి.సి. ఇంచార్జ్ విశ్వనాధ్ రెడ్డి, కార్మికులు, యువత,విద్యార్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top