
“అరైవ్ – అలైవ్ – 2026” ఫేజ్-3లో భాగంగా ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష శిబిరం…
పెద్దపల్లి// రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వుల మేరకు, “అరైవ్ – అలైవ్ – 2026” ఫేజ్-3 కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని 1 టౌన్ పోలీస్ పరిధిలో నీ ఆటో డ్రైవర్స్ కి గోదావరిఖని 1 టౌన్ ఎస్‌ఐ మనోహర్ ఆధ్వర్యంలో, దుర్గ ప్రసాద్ నేత్రాలయంలో ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది.
ఈ శిబిరంలో ఎక్కువ సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొని తమ కంటి పరీక్షలు చేయించుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ, డ్రైవింగ్ సమయంలో స్పష్టమైన చూపు చాలా ముఖ్యమని, కంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో డ్రైవర్ల ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆటో్డ్రైవర్స్, ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని పోలీస్ కోరారు.