సందర్శకుల నుండి శాలువాలు ,పుష్పగుచ్చాలకు బదులుగా నోట్ బుక్స్

TEJA NEWS

సందర్శకుల నుండి శాలువాలు ,పుష్పగుచ్చాలకు బదులుగా నోట్ బుక్స్ , పెన్నులు స్వీకరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న
నగర మేయర్ మహంకాళి స్వామి….

సందర్శకుల నుండి శాలువాలు ,పుష్పగుచ్చాలకు బదులుగా నోట్ బుక్స్ , పెన్నులు స్వీకరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి. తనను మర్యాద పూర్వకంగా కలవడానికి కొందరు శాలువాలు తీసుకురాగా సున్నితంగా తిరస్కరించారు. నోట్ బుక్స్ , పెన్నులు స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ చైతన్య కళాశాల నిర్వాహకులు , అశోక్ నగర్ వాసి కూచన సాంబయ్య లు మర్యాద పూర్వకంగా కలిసి నోట్ బుక్స్ , పెన్నులు బహుకరించారు. విద్యార్థులకు ఉపకరించే వస్తువులు మాత్రమే స్వీకరిస్తానని మేయర్ తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top