మన “టిడ్కో ఇండ్లు” ఇతర రాష్ట్రాలకు ఆదర్శం

TEJA NEWS

మన “టిడ్కో ఇండ్లు” ఇతర రాష్ట్రాలకు ఆదర్శం

** ఇళ్ళ ప్రారంభంలో సీఎం చంద్రబాబు నాయుడు
…..

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: రాష్ట్రంలో మా ప్రభుత్వం నిర్మించిన “టిడ్కో ఇండ్లు” ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో నిర్మించిన 2.50 లక్షల టిడ్కో ఇళ్లను సీఎం చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు.
2014 లోనే పేదలకు చక్కటి ఇళ్ళు కట్టాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అందుకు ఎంత ఖర్చైనా సరే అక్కచెల్లెమ్మలకు మంచి ఇళ్ళను నిర్మించాలని సిద్ధం అయినట్లు వివరించారు. దీనిపై మంత్రి నారాయణ
దేశ విదేశాలు తిరిగి అధ్యయనం చేశారని తెలిపారు. దాంతో
ఏడు లక్షల ఇళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. షీర్వాన్ టెక్నాలజీతో నిర్మాణాలు చేపట్టామని తెలిపారు.


నాణ్యతా ప్రమాణాల ఇళ్ళ నిర్మాణంలో రాజీ పడలేదన్నారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో అన్ని ఏర్పాట్లు చేసేలా డిజైన్ చేసామని చెప్పారు. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు కూడా వచ్చి టిడ్కొ ఇళ్లను పరిశీలించి వెళ్లారని తెలిపారు. ఈ నేపథ్యంలో మన ఇళ్ల నిర్మాణాలను
ఆదర్శంగా తీసుకొని వాళ్ళ రాష్ట్రాల్లో కూడా అమలు చేసారని పేర్కొన్నారు.
అటువంటి ప్రాజెక్ట్ ను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. టీడీపీపై కోపంతో పేద ప్రజలకు తీరని అన్యాయం చేసారని జగన్ ను ఘాటుగా విమర్శించారు. జగన్ మూర్ఖత్వంతో టిడ్కో ఇళ్ళ నిర్మాణ సంఖ్యను కుదించేశారని మండిపడ్డారు. వాటిని కూడా అసంపూర్తిగా వదిలేసిన ఘనుడు జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ళకోసం డబ్బులు కట్టిన పేదలను నట్టేట ముంచారని తెలిపారు. అస్తవ్యస్త పాలనతో రాష్ట్రం పై పదిలక్షల కోట్ల భారం వేసి వెళ్లారని పేర్కొన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో ఆర్ధిక పరిస్థితి గాడిలో పడుతోందని తెలిపారు.


గత ప్రభుత్వం తప్పు చేసినా ప్రజలలు ఇబ్బంది పడకూడదని సీఎం చంద్రబాబు భావించారని స్పష్టం చేశారు. 140 కోట్లు బ్యాంకుకి చెల్లించామని…
టిడ్కొ ఇళ్లకోసం డబ్బులు కట్టిన 83,869 మందిని గాలికొదిలేసి వెళ్లిపోయారని జగన్ పై మండిపడ్డారు.
వాళ్లందరికీ డబ్బులు తిరిగీ ఇచ్చేందుకు 173 కోట్లను సీఎం చంద్రబాబు మంజూరు చేసారని గుర్తు చేశారు. ఆర్ధిక పరిస్థితి బాగాలేకున్నా టిడ్కో ప్రాజెక్ట్ పునర్ నిర్మాణానికి 4400 కోట్లు కేటాయించారన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా టిడ్కో ఇళ్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
నెలల వ్యవధిలోనే విడతల వారీగా ఏడులక్షల టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, “తుడ” చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మీ, తిరుపతి ఆర్డీఓ, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top