
ఎస్ సి బాలికల వసతి గృహం నూతన భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలి….
రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి….
పెద్దపల్లి//గోదావరిఖని: . ఎస్ సి బాలికల వసతి గృహం నూతన భవనాన్ని ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు.
ఎన్ టి పి సి సంస్థ సి.ఎస్.ఆర్ నిధులు రూ 2.14 కోట్లతో పాత మునిసిపల్ కార్యాలయం ప్రక్కన కొత్తగా నిర్మించిన భవనాన్ని ఎన్ టి పి సి , మునిసిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ, భవనం పూర్తయిన నేపధ్యంలో విధ్యార్థులకు అవసరమైన మంచాలు , పరుపులు , ఫర్నిచర్ ఇతర సామాగ్రి తోపాటు నీటిని శుద్ది చేసే యంత్రం కూడా ఏర్పాటు చేయాలని అన్నారు.
త్వరలో ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు విద్యార్థినులకు అందుబాటులోకి తేవాలని అన్నారు. ఈ వసతి గృహం ప్రారంభంతో సుమారు 160 మంది ఎస్ సి విద్యార్థినులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
ఈ సంధర్భంగా పలువురు కార్పొరేటర్లు , ఎన్ టి పి సి హెచ్ ఆర్ మేనేజర్లు విజయ్ కుమార్ షిక్దర్ , యుగంధర్ రావు , కార్తీక్ , నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి వి రామన్ , టి పి ఎస్ నవీన్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.