కడు రమణీయంగా ఊంజల్ సేవ

TEJA NEWS

కడు రమణీయంగా ఊంజల్ సేవ

తిరుపతి: స్థానిక పెద్దకాపు వీధిలో వెలసిన శ్రీరామ భజన మందిరంలో నవమి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సీతారాములకు ఊంజల్ సేవ కడు రమణీయంగా నిర్వహించారు. స్థానికులు ఈ ఊంజల్ సేవలో పాల్గొని సీతారాములను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. పేట మోహన్ రామిరెడ్డి, పార్వతి దంపతులు వారి కుటుంబ సభ్యులు మూడవ రోజు ఊంజల సేవలో ఉభయదారులుగా వ్యవహరించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, కాగితాల చంద్ర, తొండమునాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విజయమ్మ, కేఎన్ రాజా, లక్ష్మమ్మ, నారాయణ రెడ్డి, తదితర భక్తులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top