లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు: చేవెళ్ల ట్రాఫిక్ సిఐ సతీష్

TEJA NEWS

లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు: చేవెళ్ల ట్రాఫిక్ సిఐ సతీష్

శంకర్‌పల్లి: లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని చేవెళ్ల ట్రాఫిక్ సిఐ సతీష్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి బీడీఎల్ క్రాస్ రోడ్ వద్ద పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఓవర్ లోడ్ తో వాహనాలు రోడ్డుపై వెళ్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ప్రమాదం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సురేష్ ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top