
మెగాస్టార్ వీరాభిమాని కాసారామ శ్రీను
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని
మండలనేని చరణ్ తేజ
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
చిలకలూరిపేట:మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆయన ఆశయాలను ఊపిరిగా మార్చుకుని సేవాపథంలో నడుస్తున్న చిలకలూరిపేట మెగాస్టార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసారామ శ్రీను పుట్టినరోజు వేడుకలు నేడు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిలకలూరిపేట జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ తన ఆత్మబంధువు శ్రీనుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
నిరంతర సేవా యోధుడు: 60 సార్లు రక్తదానం
మెగాస్టార్ పిలుపుని అందుకున రక్తదాన ప్రాముఖ్యతను చాటిచెప్పడంలో కాసారామ శ్రీను ఎప్పుడూ ముందుంటారు. కేవలం రక్తదాన శిబిరాలు నిర్వహించడమే కాకుండా, స్వయంగా 60 సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కోసం ఆయన చేస్తున్న కృషి అమోఘమని, అభిమానులందరికీ ఆయనొక స్ఫూర్తిప్రదాత అని మండలనేని చరణ్ తేజ కొనియాడారు.
చిరంజీవి వీర విధేయుడిగా గుర్తింపు
చిలకలూరిపేట నియోజకవర్గంలో మెగా అభిమానులందరినీ ఏకతాటిపైకి తెస్తూ, చిరంజీవి గారి సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శ్రీను నిరంతరం శ్రమిస్తున్నారు. ఆయన నిబద్ధత, సేవా గుణం మెగా అభిమాన లోకంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
మండలనేని చరణ్ తేజ శుభాకాంక్షలు
నా ఆత్మబంధువు కాసారామ శ్రీను కి పుట్టినరోజు శుభాకాంక్షలు. సమాజ సేవలో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని మండలనేని చరణ్ తేజ తెలిపారు.