నాలుగు లేబర్ కోడులు కార్మికులకు ఉరి తాళ్లు:

TEJA NEWS

నాలుగు లేబర్ కోడులు కార్మికులకు ఉరి తాళ్లు:

లేబర్ కోడ్ ల పై కార్మిక వర్గం ప్రతిఘటిస్తున్న అమలు చేస్తున్న కేంద్రం వైఖరి పై కార్మిక సంఘాల నిరసన

వనపర్తి : కేంద్రం 29 కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన నాలుగు లేబర్ కోడులు కార్మికుల కు ఉరితాళ్ళని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోష, సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజు అన్నారు. జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు వనపర్తి పాతగంజ్ వద్ద కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాల నేతలు కార్మికులు బ్లాక్ డే నిర్వహించారు. నేడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి కోడుల అమలుకు ఆర్డినెన్స్ తేవటం చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణిస్తూ . కోడ్ల అమలు వల్ల కార్మికులు హక్కులు కోల్పోతారని, యజమానుల శ్రమదోపిడికి కార్మికులు గురవుతారన్నారు.

కార్మికులకు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత పిఎఫ్ ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడులను కొన్ని రాష్ట్రాలు అమలు చేసేందుకు నిరాకరించాయని, తెలంగాణ ప్రభుత్వం కూడా నిరాకరించాలన్నారు. నాలుగు లేబర్ కోడుల రద్దు తో పాటు విద్యుత్ సవరణ బిల్లు-2022ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కౌన్సిలర్ గంధం మదన్, జిల్లా కమిటీ సభ్యుడు నందిమల్ల రాములు, ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, టి యు సి ఐ నేత గణేష్, సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ వంశి తోపుడుబండ్ల యూనియన్ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top