జిల్లాలో పోలీస్30 యాక్ట్ అమలు

TEJA NEWS

జిల్లాలో పోలీస్30 యాక్ట్ అమలు

అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిషేధం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు……. జిల్లా ఎస్పీ
సునిత రెడ్డి

వనపర్తి : జిల్లాలో ప్రజల సాధారణ జీవనాన్నికి అంతరాయం కలగకుండా
ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ -30 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 జిల్లా వ్యాప్తంగా అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ *సునిత రెడ్డి, ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ… జిల్లా పరిధిలో ఎవరైనా పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, భారీ స్థాయి సమావేశాలు నిర్వహించడం నిషేధం. ప్రజా జీవనాన్నికి అంతరాయం కలిగించే, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని స్పష్టం చేశారు. అలాగే “30 పోలీస్ యాక్ట్” ఉల్లంఘనలకు చట్టంలో స్పష్టమైన శిక్షలు ఉన్నాయని. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని. అందరూ తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.. ప్రజల సహకారం వల్లనే శాంతిభద్రతలు సాధ్యమవుతుందని పోలీసుల చర్యలు ప్రజల రక్షణ కోసమేనని ఎస్పీ తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top