గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది.

TEJA NEWS

గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది.

సర్పంచుల పదవి విరమణ సభలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.

కోవూరు నియోజకవర్గ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.కోవూరునియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని ఈ రోజు పదవీ విరమణ చేస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన 43 మంది సర్పంచులకు నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కార్యాలయంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. గతంలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా పదవీ విరమణ చేస్తున్న సర్పంచుల సేవలను కొనియాడుతూ వారికి నూతన వస్త్రాలతో ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గత ప్రభుత్వ నిర్వాకాలపై ధ్వజమెత్తారు. రాజ్యాంగం కల్పించిన అధికారాలను కాలరాస్తూ స్థానిక సంస్థలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారన్నారు.

You cannot copy content of this page

Scroll to Top