
ఎన్టిపిసి లో శ్రమ దోపిడీ పెరుగుతుంది,
4 లేబర్ కోడ్లు రద్దు చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం…
కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 అమలు చేయాలి….
మహాసభలో సిపిఐ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు తాండ్ర సదానందం కడారి సునీల్ డిమాండ్….
పెద్దపల్లి//ఎన్టిపిసి: రామగుండం ఏరియా క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ 9వ. మహాసభ ఎఫ్సీఐ రోడ్, కృష్ణ ఫంక్షన్ హాల్లో ఎం.శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభకు సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ హాజరై మాట్లాడుతూ… ఎన్ టి పి సి కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనం 26000 చెల్లించాలని, నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడి పెరుగుతుందని రాబోయే రోజుల్లో ఐక్య పోరాటాలకు సిద్ధంగా ఉండాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికి పోరాటాల శరణ్యమని పోరాటాల ద్వారానే హక్కులు కాపాడబడతాయని, అనంతరం రామగుండం ఏరియా కాంటాక్ట్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా కడారి. సునీల్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా ఎం. శంకర్, అధ్యక్షులుగా రెడ్డపాక లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నాంసాని శంకర్ లతో పాటు 35 మందినీ ఏకగ్రీవంగా సభలో ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. ఈ మహాసభలో ఏఐటీయూసీ రామగుండం నగర అధ్యక్షులు అబ్దుల్ కరీం, జిల్లా నాయకులు పెరిక రాయమల్లు, సత్యనారాయణ, నారాయణ, అర్జున్, మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.