విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి…

TEJA NEWS

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి…..

ఐ.కృష్ణ ఐఎఫ్టీయు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు….

పెద్దపల్లి//గోదావరిఖని: రాష్ట్రంలో అత్యవసర విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న విద్యుత్ కార్మికులు సుమారు 20వేల మంది నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగింది. విద్యుత్ కార్మికుల సమ్మెకు ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తుంది.

ఐఎఫ్టియు ముఖ్య కార్యకర్తల సమావేశం గోదావరిఖని యూనియన్ కార్యాలయంలో జరిగింది.
ఈ యొక్క సమావేశంలో ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఐ.కృష్ణ మాట్లాడుతూ… రాష్ట్రంలో అత్యవసర విభాగమైనా విద్యుత్ శాఖలో సుమారు 20వేల మంది కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లారు, విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నిరవధిక సమ్మెను చేపట్టడం జరిగిందని, విద్య అర్హతలు ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్షన్ చేయాలని, వీరికి ఏపీఎస్ఈసి రూల్స్ వర్తింప చేసి అమలు చేయాలని, టీజీ ఎన్సీడీసీఎల్ ను టీజీ ఎస్పీడీసీఎల్ లలో విలీనం చేయాలని, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ 2016. డిసెంబర్ 4 ముందు ఉండే కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న వారిని వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించాలని, విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని, 2016 పి అర్ సి ని అమలు చేయాలని తదితర సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ఈ సమ్మెలోకి వెళ్లారని, ప్రభుత్వం ఈ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా మొండి వైఖరినీ అవలంబిస్తుందని, సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే ఈ సమ్మెకు కారణం అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు తమ విధానాలను మానుకొని కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆర్టిజన్ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఐఎఫ్టీయు పూర్తి మద్దతునిస్తుందని తమ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఐఎఫ్టీయు ఈ కార్మికులకు అండగా ఉంటుందని, సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కార్మికులు ఇదే పట్టుదలతో సమ్మెను కొనసాగించాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఐఎఫ్టీయు జిల్లా నాయకులు ఏ వెంకన్న, ఈ నరేష్, బి అశోక్, ఐ రాజేశం, ఎస్ రాజన్న, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top