మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి …

TEJA NEWS

మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి ….

సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం…

–జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…

పెద్దపల్లి// . మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను మనమందరం ఆచరించాలి అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి.వేణు లతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,
మన దేశం అభివృద్ధి చెందాలంటే మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను ,ఆలోచనలు మనమందరం ఆచరిస్తూ, అమలు చేస్తూ దేశ అభివృద్ధిని సాధించవచ్చు అని, సమాజంలోని అసమాన తలను తొలగించవచ్చని కలెక్టర్ అన్నారు.

సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతి బా పూలే అప్పటి సమాజంలో పోరాటం చేశారని, ఆ స్ఫూర్తి మనమంతా తీసుకోవాలని, సామాజిక అసమానతలు దూరమయ్యేందుకు మన వంతు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని, స్త్రీలు విద్యా వంతులు కావాలని ఆకాంక్షించారని తెలిపారు.

అంతకంటే ముందు పెద్దపల్లి లోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిని లు కూచిపూడి నృత్యం ప్రదర్శన చేసి అలరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి జే.రంగా రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్ ప్రకాశ్, వివిధ బీసీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు,ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top