
కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ 116 డివిజన్ మాజీ కార్పొరేటర్ సబిహా గౌస్ ఉద్దీన్ సప్ధర్ నగర్ లో నాలా డీ-సిల్టింగ్ పనులను పర్యవేక్షించడం జరిగింది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనుల్లో భాగంగా నాలాను పూర్తిగా లోతుగా శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు.అలా చేయకపోతే వర్షాకాలంలో నీరు వెనక్కి తిరిగి ఇళ్లలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని తెలిపారు. అందువల్ల పనులు నాణ్యతతో, సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హమ్మిద్, సలీమ్, రవీందర్ రెడ్డి, రామ్ రెడ్డి, మల్లేష్, దుర్గ, నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు.