
ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి…
బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా మోసం చేస్తూ మహిళలపై కపట ప్రేమ చూపిస్తోంది. ఎర్రబెల్లి స్వర్ణ
కేవలం రాజకీయ లబ్ధి కోసం, త్వరలో జరుగనున్న తమిళ నాడు మరియు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో వ్యతిరేక ముప్పు ఉందని గ్రహించి, ఏకైక లక్ష్యంతో వారు మహిళా బిల్లును 16వ తేదీన తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఈ రోజు గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అన్నారు.
40 సంవత్సరాల క్రితమే స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే మహిళా రిజర్వేషన్‌ను పార్లమెంట్లో, రాజ్యసభలో అమలు చేయాలని చర్చ ప్రారంభమైందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరెట్ ఆల్వా నాయకత్వంలో ఒక పార్లమెంట్ కమిటీ వేసి చర్చ జరిగింది. కొంతమంది దీనిని వ్యతిరేకించారని అన్నారు.
2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. అలాగే 2013లో, శ్రీమతి సోనియా గాంధి సూచన మేరకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన ఆమోదం పొందలేదని అన్నారు.
ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ చట్టం ప్రకారం, జనగణన మరియు డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యాక మహిళా రిజర్వేషన్ అమలు 2034 తర్వాత జరిగే అవకాశం ఉంది.
బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లును 10 సంవత్సరాల క్రితమే అమలు చేయాల్సి ఉండేది. ఎందుకు చేయలేదు?
కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇప్పుడు మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ అమలు కోసం 40 సంవత్సరాల క్రితం నుంచే చిత్తశుద్ధితో ఉంది.
అదే చిత్తశుద్ధి, అదే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పంచాయతీరాజ్ 73వ ఆర్టికల్ ద్వారా రాజ్యాంగ సవరణ చేసి (1992) దేశంలోని మహిళలకు పంచాయతీల్లో రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. దీని ద్వారా దేశంలోని సుమారు 15 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరింది.
ఎస్సీ, ఎస్టీతో పాటు ఓబీసీలకు కూడా ఈ రిజర్వేషన్‌లో వాటా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మద్దతు తెలుపుతుంది.
బీజేపీ వారు ఆడుతున్న ఈ నాటకాన్ని ప్రజలు గమనించాలి. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే బీజేపీ హైడ్రామా ఇదంతా .
2010లోనే మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి ఎంత చిత్తశుద్ధితో ఉందో ప్రజలందరికీ తెలుసు.
బీజేపీ కేవలం తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ బిల్లును ముందుకు తీసుకువస్తోంది.
మరోవైపు డిలిమిటేషన్ ప్రక్రియ కూడా గందరగోళంగా ఉంది. సగటుగా 50% సీట్లు పెంచడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడింది వాస్తవం కాదా అని అడుగుతున్నాము. ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. అప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం.
ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకులు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.