
శ్రీ చైతన్య గ్రాడ్యుయేషన్ డే సూపర్ సక్సెస్
చదువులతో పాటు పిల్లలకి ఆటపాటలు ముఖ్యం
తల్లిదండ్రులకి, మేనేజ్మెంట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు
ప్రధాన ఉపాధ్యాయురాలు షేక్. అస్మత్ బేగం
శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ లో ప్రధానోపాధ్యాయురాలు షేక్. అస్మత్ బేగం ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ డే చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులతల్లిదండ్రులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆటపాటల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో గ్రాడ్యుయేషన్ డే గ్రాండ్ గా చేయడం జరిగింది. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రీ ప్రైమరీ విద్యార్థులు ప్రైమరీ సెక్షన్ కి, ప్రైమరీ సెక్షన్ నుంచి 6 క్లాస్ హై స్కూల్ కి వెళ్తున్నారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే ని జరపడం జరిగింది. ప్రతి సంవత్సరం ప్రోగ్రాం ఇలాగనే జరుగుతుంది ఆ సెక్షన్ లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి విద్యార్థుల ఆశయాలు రీచ్ అవ్వాలని మా మేనేజ్మెంట్ ఉద్దేశం మా మేనేజ్మెంట్ ఇచ్చిన ముఖ్య సందేశాలు.
మాకు సహకరిస్తున్న మా విద్యార్థుల పేరెంట్స్ కి ప్రత్యేక వందనాలు మా శ్రీ చైతన్య ఈ విద్యాసంస్థలు ఆల్ ఇండియాలో రేంజ్ లో ప్రతి ఒక్క దాంట్లో నెంబర్ వన్ ర్యాంక్ తెచ్చుకున్న విద్యాసంస్థ మా శ్రీ చైతన్య అని గర్వంగా చెప్పుకుంటున్నాం మా సహకరిస్తున్న మేనేజ్మెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తల్లి లాంటి శిక్షణ తండ్రి లాంటి రక్షణ మా బ్రాంచ్ విద్యార్థులు టెన్త్ క్లాస్ చాలా బాగా ఎగ్జామ్స్ రాశారు మంచి ర్యాంకులు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్క విద్యార్థికి మంచి విద్యను మేము అందిస్తామని మీకు తెలియజేస్తున్నాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరొక మారు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో డీన్.బి. మహేష్, ప్రైమరీ ఇంచార్జ్ యస్. శైలజ,ఫ్రీ ప్రైమరీ ఇన్చార్జ్ సుజనా, శ్యామల, దీప అపూర్వ,లహరి, హబీబునిసా, షమాపర్హీన్, కాంచన, తల్లిదండ్రులు, విద్యార్థులు, పాల్గొనడం జరిగింది.