కందమామిడి జి టి డబ్ల్యూ స్కూల్ నందు ప్రపంచ మొక్కల అభినందన దినోత్సవం

TEJA NEWS

కందమామిడి జి టి డబ్ల్యూ స్కూల్ నందు ప్రపంచ మొక్కల అభినందన దినోత్సవం

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వనుగుపల్లి పంచాయితీ కందమామిడి జి టి డబ్ల్యూ బాలికల పాఠశాల నందు సోమవారం ఏప్రిల్ 13న ప్రపంచ మొక్కల అభినందన దినోత్సవం సందర్భముగా స్కూల్ నందు మొక్కలు నాటడం జరిగినది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 13న జరుపుకుంటారు పర్యావరణ వ్యవస్థ మొక్కల ప్రాముఖ్యత వాటి వైవిధ్య మరియు మన దైనందిన జీవితంతో అవి పోషించే కీలక పాత్రనుగా గుర్తించడానికి ఈ రోజున జరుపుకుంటాము ఈ రోజున మొక్కల నాటడం తోట పని చేయటం ప్రకృతి నడక వంటి కార్యక్రమాల ద్వారా మొక్కల పట్ల మన ప్రేమను వ్యక్తపరచవచ్చును ఈరోజును మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరమైన జీవనశైలిని గురించి అవగాహన పెరుగుతుంది

మొక్కలు నాటుతూ పాఠశాల బాలికలతో చెబుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ. వెంకటలక్ష్మి. ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం ఎ.సుశీల పి ఈ టి ఆర్. వెంకటలక్ష్మి (కళలు) ఆర్ట్సటిటిసి జనపరెడ్డి అప్పారావు వారు సమక్షంలో పాఠశాల పిల్లలకు అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటడం జరిగినది ఇదే సందర్భంలో కందమామిడి జి టి డబ్ల్యూ పాఠశాల సిబ్బంది టీచింగ్ స్టాఫ్ తో కలిపి 30 మంది పాఠశాల వర్కర్స్ 5గురు ఈ పాఠశాల నందు సిబ్బంది ఉన్నారు పాఠశాలలో సిబ్బందికి ఎవరికైనా పుట్టినరోజు జరుపుకునేటప్పుడు ఇదే స్కూలు నందు ఒక మొక్క తీసుకువచ్చి నాటే కార్యక్రమం జరుగుతుంది చిన్న చిన్న పూల మొక్కలు మరియు పండ్ల మొక్కలు నాటటం జరుగుతుంది ఇలా నాటడం వలన మన పుట్టినరోజు ఆనందంతో వ్యక్తం చేసినట్టు అది స్కూల్లో పనిచేసేంతవరకు ఆనందంగా ఉంటుందని పాఠశాల ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు ఇదే ఇలా మన ఏజెన్సీ లో ఉన్న అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులు పుట్టినరోజున కార్యక్రమం చేస్తే ఇలాంటి రోజున మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరమైన జీవనశైలిని గుర్తించే అవగాహన పెరుగుతుంది. ఈ దినోత్సవం1999 న పర్యావరణ ఉద్యమ సమయంలో ఉద్భవించింది అదే సందర్భముగా ఇలా చిన్నచిన్న మొక్కలు నాటే కార్యక్రమం చేస్తే బాగుంటుందని జనపరెడ్డి అప్పారావు వారు ఓ పత్రిక ప్రకటనలో తెలియపరచారు

You cannot copy content of this page

Scroll to Top