
ఆర్టిజన్ల 8వ రోజు ఆందోళనకు సిపిఐ మద్దతు
విద్యుత్ సంస్థ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్
వనపర్తి : రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఆర్టిజన్ల సేవలు కీలకమని, వారిని నిర్లక్ష్యం చేయటం తగదని డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. వనపర్తి ఎస్.ఈ ఆఫీస్ ఆవరణలో గత ఎనిమిది రోజులుగా ధర్నా చేస్తున్న సందర్భంగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాను సందర్శించి పోరాటంలో మీ వెంట మేముంటామని కడవరకు పోరాడాలని మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 19,400 మంది ఆర్టిజన్లు విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నారని, అందులో వనపర్తి జిల్లాకు సంబంధించి 178 మంది 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ఆర్టిజన్లను విద్యుత్ సంస్థ ఉద్యోగులుగా గుర్తించిన వారి వేతనం పెంచలేదన్నారు.
రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వారు పని చేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు ఒకరూల్, ఆర్టిజన్లకు మరో రూల్ అమలు చేస్తున్నారని ఒకే సంస్థలో పనిచేస్తున్న వారికి రెండు రకాల రూల్స్ అమలు చేయటం ఏమిటని ప్రశ్నించారు. రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి ఒకే రూల్ అమలు చేయాలన్నారు. ఆర్టిజన్లు రాష్ట్ర విద్యుత్ సంస్థకు ఊపిరిని ప్రభుత్వం దీన్ని విస్మరించరాదు అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తే ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 8 రోజులుగా వారు ఆందోళన చేస్తున్న పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు.
కనీసం వారిని చర్చలకు కూడా పిలవడం లేదని ఆర్టిజన్లు ఎవరని సాక్షాత్తు విద్యుత్ శాఖ మంత్రి ప్రశ్నించటం బాధాకరమన్నారు. ఆర్టిజన్లు బేషరతుగా ధర్నా విరమించి విధుల్లోకి హాజరైతేనే చర్చలకు పిలుస్తామని నిబంధన పెట్టటం సరికాదన్నారు. ఆర్టిజన్లకు ఏపీ ఎస్ సి బి సర్వీసెస్ అమలు చేయాలని, టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎల్పీడీసీఎల్ నెల పనిచేస్తున్న అన్ మ్యాన్ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించాలని, సీనియారిటీ ఉన్న ఆర్టిజన్లను ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలని, 2016 ముందు సంస్థల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, 2026 పిఆర్సి వేతన సవరణ అమలు చేయాలని, విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం అందించాలన్న వారి డిమాండ్లు న్యాయసమతమన్నారు. వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతారని జాగ్రత్తగా ఉండి ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరిపే దాకా పోరాటం ఆపవద్దని సిపిఐ ఎండగా ఉండి పోరాడుతుందని ధైర్యం చెప్పారు. సిపిఐ నేతలు డి శేఖర్, చిన్న కురుమయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.