ప్రజా సేవ చేస్తున్న ప్రశాంతి రెడ్డికి దక్కిన గౌరవం

TEJA NEWS

ప్రజా సేవ చేస్తున్న ప్రశాంతి రెడ్డికి దక్కిన గౌరవం

పోలీట్ బ్యూరో సభ్యురాలుగా నియామకం సందర్భంగా పడుగు పాడులో టిడిపి నాయకులు సంబరాలు

కోవూరు పడుగుపాడు టిడిపి నాయకులు ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షులు బత్తుల రమేష్ అధ్యక్షతన ప్రజా సేవ చేస్తున్న ప్రశాంతి రెడ్డికి దక్కిన గౌరవం పోలీట్ బ్యూరో సభ్యురాలుగా నియమకమైన సందర్భంగా కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం ప్రజల ప్రేమతో నాయకులు, కార్యకర్తల, అండదండలతో గెలిచిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, గడిచిన 2 సంవత్సరాల్లోనే కోవూరు రూపురేఖలే మార్చేసి, అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నారని ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజాసేవ చేస్తూ ముందుకు పోతున్నారని. వారిని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ వారికి ఇచ్చిన అరుదైన గౌరవం పోలీట్ బ్యూరో సభ్యురాలుగా నియమించడం హర్షనీయమని అని ప్రజాసేవ చేయడానికి వారి జీవితాన్ని అంకితం చేస్తున్నారని తెలిపారు..

You cannot copy content of this page

Scroll to Top