
పేద ప్రజల కోసం ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్ లో అన్ని రకాల మందులను వైద్య సేవలను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి…
ఏఐటీయూసీ నగర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం,శనిగరపు చంద్రశేఖర్ లా డిమాండ్…
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని: . ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్ సందర్శన చేయడం జరిగింది. ఇక్కడ తీవ్రమైన మందులు, వైద్య సేవలు కొరత నెలకొనడం పట్ల ఏఐటీయూసీ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం,శనిగరపు చంద్రశేఖర్ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆధారపడే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను కార్పొరేట్ ఆసుపత్రులకు లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, వెంటనే మీ విధానం మార్చుకోవాలని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్ లలో అన్ని రకాల వైద్య సేవలు మరియు మందులను అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్ లో పేసెంట్ లకు మందులు అందుబాటులో లేకపోవడం వల్ల నిరుపేద మధ్య తరగతి పేషెంట్లకు రెగ్యులర్ ట్రీట్మెంట్ ఆపేస్తున్నారని వారు ధ్వజ మెత్తరు. అత్యవసర మందుల కొరత తో పేషంట్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అని వారు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా, మందులు లేకపోవడంతో రోగులు బయట ప్రైవేట్ మెడికల్ షాపుల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని ఇది పేదలపై ఆర్థిక దాడి మాత్రమే కాకుండా, ఆరోగ్య హక్కులను బహిరంగంగా తుంగలో తొక్కడమేననీ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాస్తే మందులు లేవు అంటే మీరు ఇండెంట్ పెట్టీ తెచ్చే లక్షలాది రూపాయల ముందు ఏమవుతున్నాయని వారు ప్రశ్నించారు.
ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్ లో మందుల కొరతపై జ్యుడీషియల్ విచారణ జరపాలని, ప్రభుత్వం మందులను తక్షణమే ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని, మందుల కొనుగోలు, సరఫరాలో జరిగిన అవినీతిపై సంబంధించిన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, కార్పొరేట్ ఆసుపత్రులకు లాభం చేకూర్చే విధానాలను వెంటనే నిలిపివేయాలని, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి, ప్రతి పౌరుడికి ఉచిత, నాణ్యమైన వైద్యం ను హక్కుగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్ లో పూర్తి స్థాయిలో స్పెషలైజ్డ్ డాక్టర్లు లేరు ఓపీ పెరిగింది కానీ ఓపీ రాయడానికి సరిపడా సిస్టమ్ ఆపరేటర్ లు లేరు ఎక్స్ రే కి పోతే అక్కడ సిబ్బంది టెక్నీషన్ లా కొరతే క్యూలో నిలబడి నిలబడి ఎదురు చూడాలి సమయానికి డాక్టర్స్ రారు వచ్చిన వారి టైమ్ అయ్యేదాకా ఉండరు వందల మంది కి ఒక్కటే ఇ సి జి వందల మంది కి ప్రెగ్నెన్సీ లేడీస్ కి ఒక్కటే స్కానింగ్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఇంకా సిటీ స్కాన్ ఇతరత్ర వాటికి సంబంధించిన టెక్నీషియన్ లేరు టూ డి కో తీయడానికి డాక్టర్స్ అందుబాటులో ఉండరు, సాయంత్రం పూట వారి ప్రవేట్ హాస్పిటల్ లో పేసెంట్ లేకుంటే వస్తారు, గుండె సంబంధిత వైద్యులు యురలా జిస్ట్ చెవి లాంటి వైద్యులు ఉండరు, వచ్చిన ఒక్కటే గంట పేసెంట్ లను చూస్తే చూస్తారు లేకుంటే లేదు, మందులు పేసెంట్ కి ఇచ్చే కాడా పార్మ సిస్ట్ ఉండనే ఉండరు ఏమి తెలియని నర్సింగ్ ట్రైనీ సిస్టర్ లు మందులు ఇస్తారు, ఇవ్వన్నీ మెడికల్ సూపర్ డెంట్ సంబంధిత అధికారులు మాకేమి తెలియదన్నట్టుగా నాటకాలడూతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనీ వెంటనే మీ విధానం మార్చుకోవాలని వారు హెచ్చరిoచారు.
ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్ లొ ఆరోగ్య రంగానికి భారీ నిధుల తో తప్పుడు ఇండెంట్ లు పెట్టి ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్న మెడికల్ సూపర్ డెంట్ ఇతర సంబంధించిన అధికారులను మందుల కొనుగోలు, సరఫరా లో జరిగినా అవినీతి నిర్వాకం, మధ్యవర్తుల దోపిడీ వల్ల ప్రజలకు మందులు అందడం లేదని వారు దూయ బట్టారు.
ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి, ప్రతి పౌరుడికి ఉచిత, నాణ్యమైన వైద్యం హక్కుగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే, ఏఐటీయూసీ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో దశలవారి నిరసనలు ఆందోళనలు చేపడుతామని ఏఐటీయూసీ నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం,శనిగరపు చంద్రశేఖర్ లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో శనిగరపు తిరుమల
శనిగరపుమతీనా ముర్సాలీన్ శేఖర్ ఉసకోయీల రసజ్ఞ, షేక్ మసూద్, రాజేశ్వరి,రవి, ఈదునూరి రమేష్, యాసర్ల శ్రీనివాస్, షేక్ మసూద్,మొహమ్మద్ సాబీర్, వోలసాని రాజు కుమార్, కటకర వనితా, పాకలపాటి నాగమణి, శనిగరపుశేఖర్ సత్యం తదితరులు పాల్గొన్నారు.