ప్రభుత్వ భూముల కబ్జాలను అరికట్టండి సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

TEJA NEWS

ప్రభుత్వ భూముల కబ్జాలను అరికట్టండి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.

కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారం సర్వే నంబర్ 326,307 లో ఉన్న ప్రభుత్వ భూమిని బస్సు టెర్మినాల్ కోసం,కేంద్రియ విద్యాలయం కోసం,పోలీస్ క్యాంపు కోసం కేటాయించామని ప్రభుత్వం చెపుతుంటే,పత్రికలో వస్తున్నపటికి గతంలో హైడ్రా వచ్చి కూల్చినప్పటికి మళ్ళీ అదే స్థలంలో నిర్మాణాలు సాగుతున్నాయని కావున వెంటనే ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ నేడు జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో సిపిఐ జిల్లా నాయకత్వం జిల్లా జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజులరామారంలోని ప్రభుత్వ భూమిలో గత సంవత్సరంలో హైడ్రా కూల్చి వేసినప్పుడు కొంతకాలం కబ్జాలు ఆగిపోయినప్పటికీ మళ్లీ ఇప్పుడు మొదలయ్యాయని ఈ విషయాలను ఎప్పటికప్పుడు సిపిఐ నాయకత్వం మరియు పత్రికలు స్థానిక రెవెన్యూ అధికారులకు తెలియజేస్తున్నప్పటికీ ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల గతంలో హైడ్రా కూల్చి వేసినప్పుడు ఏ విధంగా అయితే ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు చెడ్డ పేరు వచ్చిందో,పేద ప్రజలు ఇబ్బంది పడ్డారో అదే సంఘటన మరోసారి పునరావృతమయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి సంఘటనలు జరగకుండా పేద ప్రజలు మోసపోకుండా ప్రభుత్వ భూమిని కాపాడడానికి గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో జిల్లా జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి గారిని కోరడం జరిగింది. అధికారులు సెలవుల్లో ఉన్నప్పుడు మరియు అధికారులు మారినప్పుడు ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని కావున కబ్జాదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సాయిల్ గౌడ్ మండల కార్యదర్శిలు నరేంద్ర ప్రసాద్,రాములు , కృష్ణ, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top