వైభవంగా బ్రహ్మోత్సవ ధ్వజారోహణం

TEJA NEWS

వైభవంగా బ్రహ్మోత్సవ ధ్వజారోహణం

** నారాయణవనం అగస్తీశ్వర ఆలయంలో….

తిరుపతి / పుత్తూరు: పుత్తూరుకు 3 కి.మీల దూరంలోని నారాయణవనం శ్రీ మరగదవల్లీ సమేత శ్రీ అగస్తీశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఉదయం 7.30 నుంచి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించారు. రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

వాహన సేవల వివరాలు:

22న (నేడు) – సింహ వాహనం
23 – హంస వాహనం
24 – శేష వాహనం
25 – నంది వాహనం
26 – గజ వాహనం
27న రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.
కాగా 28న రాత్రి 7 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించి, అనంతరం అశ్వవాహన సేవ ఉంటుంది. రూ.500 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనే గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం, అన్నప్రసాదం అందజేస్తారు.
29న ఉదయం 9 గంటలకు శ్రీ నటరాజస్వామివారి వీధి ఉత్సవం జరుగనుంది. సాయంత్రం రావణాసుర వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. 30న కైలాసకోనలో త్రిశూల స్నానం ఘనంగా నిర్వహించి, అదేరోజు రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల మధ్య ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, రాత్రి 7.30 గంటలకు వాహనసేవ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు కోలాటం, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఆలయ చరిత్ర

నారాయణవనం ప్రాంతాన్ని పరిపాలించిన శ్రీ పద్మావతీదేవి తండ్రి అయిన శ్రీ ఆకాశ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శ్రీ అగస్తీశ్వరస్వామివారు స్వయంభువుగా వెలిశారు. అనంతరం శ్రీ అగస్త్య మహర్షులు వేద ఆగమ శాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడంతో స్వామివారికి “అగస్తీశ్వరస్వామి” అనే పేరు వచ్చింది.

You cannot copy content of this page

Scroll to Top