గాంధీ భవన్ లో జరిగిన సంఘటన సృజన అభియాన్ సమీక్ష సమావేశం

TEJA NEWS

గాంధీ భవన్ లో జరిగిన సంఘటన సృజన అభియాన్ సమీక్ష సమావేశం లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్….

.గాంధీభవన్లో నిర్వహించిన సంఘటన సృజన్ అభియాన్ సమీక్ష సమావేశంలో తెలంగాణ ఏఐసీసీ మీనాక్షి నటరాజన్ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశంలో కరీంనగర్ పార్లమెంట్ సమన్వయకర్తగా నియమితులైన కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ వారితో కలిసి సమావేశంలో పాల్గొన్నారు..

ఈ సందర్భంగా ఏఐసిసి ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు తీసుకోవలసిన అంశాలపై పలు సూచనలు చేయడం జరిగింది, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ, మండల, డివిజన్ స్థాయిలలో కాంగ్రెస్ పార్టీ కమిటీలను వేసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని తెలిపారు..

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఏఐసిసి సెక్రెటరీ రోహిత్ చౌదరి మరియు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు,ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top