ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై చర్యలు తీసుకోని పోలీస్

TEJA NEWS

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై చర్యలు తీసుకోని పోలీస్

** తిరుపతి ఏఎస్పీ రవిమనోహరచారికి వైసీపీ ఫిర్యాదు
….

తిరుపతి: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి – ఏబీఎన్ రాధాకృష్ణ పై తక్షణమే కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై సోమవారం తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ రవిమనోహర చారికి వినతిపత్రం అందజేశారు.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై జిల్లా లోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా సరే ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి , తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్, గంగాధరనెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి, తిరుపతి మాజీ మేయర్ డాక్టర్ శిరీష యాదవ్, నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top