
గెలుపులో కీలకపాత్ర పోషించినందుకే.. అభివృద్ధి, సంక్షేమ కానుకలు : ప్రత్తిపాటి
- ఏపీ ప్రజలు గుజరాత్ ను ఆదర్శంగా తీసుకోవాలి.
- నాదెండ్ల మండల కేంద్రంలోని శ్రీ గోవర్థన స్వామి చెరువు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి.
- వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, సోలార్ లైటింగ్ ఏర్పాటుకు ఎమ్మెల్యే శ్రీకారం.
తెలుగుదేశం గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్న నాదెండ్ల గ్రామానికి ఎంత అభివృద్ధి, సంక్షేమం బహుమతిగా ఇచ్చినా ప్రజల రుణం తీరదని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన నాదెండ్ల మండల కేంద్రంలో రూ.50 లక్షలతో చేపట్టిన శ్రీ గోవర్థన స్వామి చెరువు ఆధునికీకరణ పనులకు గ్రామస్తులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్తిపాటి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. స్థానిక చెరువును బాగుచేయడంతో నీటి సంరక్షణతో పాటు.. వృద్ధులు చిన్నారులకు ఉపయోగపడేలా వాకింగ్ ట్రాక్, పిల్లల పార్క్ ల అందుబాటులోకి వస్తాయన్నారు.
గ్రామ నాయకత్వం సమన్వయం.. సహకారంతో పనిచేస్తే కూటమికి ఎదురుండదు
నాదెండ్ల టీడీపీ కంచుకోటని, ప్రజలకు ఎంత మంచి చేస్తే అంతగా ఆదరిస్తారని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శమని ప్రత్తిపాటి చెప్పారు. 2014-19లో 4వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేసినా ప్రజలు టీడీపీని కాదని, వైసీపీని గెలిపించి తీవ్రంగా నష్టపోయారన్నారు. ఏపీ ప్రజలు కూడా గుజరాత్ ను ఆదర్శంగా తీసుకోవాలని, ఒకే ప్రభుత్వం సుదీర్ఘకాలంలో అధికారం ఉండబట్టే.. ఆ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రజలకోసం పనిచేసే నాయకత్వాన్ని కాదనుకుని ఎంత నష్టపోయామో, గత ఐదేళ్లలో చూశామన్నారు. గ్రామనాయకత్వం సమన్వయం… సహకారంతో ఏకతాటిపై నిలిస్తే,. కూటమి ప్రభుత్వానికి ఏ ఎన్నికలోనూ ఎదురే ఉండదన్నారు. ఈర్ష్యాద్వేషాలు, వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు పక్కనపెట్టి, ప్రజలు..రాష్ట్రం కోసం ఆలోచించడమే నిజమైన నాయకుడికి ఉండే గొప్ప లక్షణమని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, సొసైటీ చైర్మన్ నల్లమోతు హరిబాబు, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ రైతు అధ్యక్షులు సూర్యనారాయణ, టీడీపీ నాయకులు వేములపల్లి బసవయ్య, నెల్లూరి పూర్ణయ్య, శ్రీనివాస రెడ్డి, ఈదార సాంబయ్య, టారిష్, ఏ.పి.ఓ రామారావు, గ్రామ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.